Sunday, January 18, 2009

ఈ జన్మలో మరి ఆ జన్మలో

నిను చూడక నేనుండలేను
నిను చూడక నేనుండలేను
ఈ జన్మలో మరి ఆ జన్మలో
ఈ జన్మలో మరి ఆ జన్మలో
ఇక ఏ జన్మకైనా ఇలాగే
నిను చూడక నేనుండలేను
నిను చూడక నేనుండలేను

ఏ హరివిల్లు విరబూసినా
నీ దరహాసమనుకుంటిని
ఏ చిరుగాలి కదలాడినా
నీ చరణాల శ్రుతి వింటిని
నీ ప్రతి రాకలో ఎన్ని శశిరేఖలో
నీ ప్రతి రాకలో ఎన్ని శశిరేఖలో
నిను చూడక నేనుండలేను

నీ జత గూడి నడయాడగా
జగమూగింది సెలయేరుగా
ఒక క్షణమైన నిను వీడినా
మది తొణికింది కన్నీరుగా
మన ప్రతి సంగమం
ఎంత హ్రుదయంగమం
మన ప్రతి సంగమం
ఎంత హ్రుదయంగమం
నిను చూడక నేనుండలేను

Wednesday, December 24, 2008

రానేల వసంతాలే

రానేల వసంతాలే
శ్రుతి కానేల సరాగాలే
నీవే నా జీవన రాగం స్వరాల బంధం
నీవే నా యవ్వన కావ్యం స్మరించే గీతం

రానేల

ఈ మౌన పంజరాన నే మూగనై
నీ వేణువూదగానే నీ రాగమై
ఇగిరే శోకమై విరిసే తోటనై
ఏ పాట పాడిన అది పూవులై
అవి నేల రాలిన చిరు తావినై
బదులైన లేని ఆశలారబోసి

రానేల

ఓ ప్రేమికా చెలియా ఒడి చేరవా
ఈ చెలిమిని ఇపుడే దరి చేర్చవా
రగిలే తాపమే ఎదలో తీరగా
నీ చూపు తోనే చలి తీరగా
నీ స్పర్శ తోనే మది పాడగా
ఎద మీటి పోయే ప్రేమగీతిలాగా

రానేల

రేగుతున్నదొక రాగం ఎద లో సొద లా

రేగుతున్నదొక రాగం ఎద లో సొద లా
రేపుతున్నదొక మోహం నది లో అలలా
కనులే ముద్దులాడగా
కలలే కన్ను గీటగా
కసిగా
రేగుతున్నదొక రాగం ఎద లో సొద లా
రేపుతున్నదొక మోహం నది లో అలలా

చెక్కిళ్ళలో ముద్దు చెమ్మ తడి ఆరకున్నది
నీ కళ్ళలో నీటి బొమ్మ కదలాడిందే
తెలిపింది కన్నె గళమే మనువాడ లేదనీ
ఓ పువ్వు పూసింది ఒడిలో తొలి ప్రేమల్లే
మెలకువే స్వప్నమై మెలి తిరిగెను నాలో
ఒరిగినా ఒదిగినా హత్తుకునే ప్రేమ
నీ పిలుపే నిలిచే వలపై
పెదవుల్లో దాగి

రేగుతున్నదొక రాగం ఎద లో సొద లా
రేపుతున్నదొక మోహం నది లో అలలా
కనులే ముద్దులాడగా
కలలే కన్ను గీటగా
కసిగా
రేగుతున్నదొక రాగం ఎద లో సొద లా
రేపుతున్నదొక మోహం నది లో అలలా

తారాడు తలపులెన్నో నీలాల కురులలో
తనువు మరచిపోయె మనులే పొంగే
ముద్దాడ సాగె పెదవి ఒక మూగ భావమే
చాటు కవితలన్నీ అనురాగాలే
పెదవులే విచ్చిన మల్లెపూల వాసన
సొగసులే సోకిన వయసుకే దీవెన
వీరెవరో జత కోకిలలో
ఎద లేడై లేచి

రేగుతున్నదొక రాగం ఎద లో సొద లా
రేపుతున్నదొక మోహం నది లో అలలా
కనులే ముద్దులాడగా
కలలే కన్ను గీటగా
కసిగా
రేగుతున్నదొక రాగం ఎద లో సొద లా
రేపుతున్నదొక మోహం నది లో అలలా

Monday, December 22, 2008

7/G బ్రుందవన్ కాలని

కన్నుల బాసలు తెలియవులె
కన్నెల మనసులు ఎరుగములె
ఒకవైపు చూపి మరువైపు దాచగ
అద్దాల మనసు కాదులె, చేతులు సంధ్రాన్ని మూయలేవులె
గాలివీచి ఆకు రాలిన కొమ్మ గురుతులు చెరగవులె
దెబ్బలెన్ని తిన్న గాని మనసు మాత్రమ్ మారదులె

ఒక పరి మగువ చూడగనె కలిగే వ్యధ తను యెరుగదులె
అనుదినము ఇక తపి ఇంచె యువకుల మనసులు తెలియవులె

కురిసేను విరి జల్లులే

కురిసేను విరి జల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే
అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను
శృంగార మునకీవె శ్రీకారమే కావె
ఆకుల పై రాలు ఆ..
ఆకులపై రాలు హిమబిందువు వోలె
నా చెలి వొడిలోన పవళించనా
ఆకులపై రాలు హిమబిందువు వోలె
నా చెలి వొడిలోన పవళించనా
రాతిరి పగలు మురిపాలు పండించు
చెలికాడిని ఎద చేర్చి లాలించనా
నేను నీకు రాగ తాళమ్
నీవు నాకు వేద నాదమ్ ఆ..

కన్నుల కదలాడు ఆశలు శృతి పాడు
వన్నెల మురిపాల కధ యేమిటో
తలపుల మాటుల్లో వలపుల తోటల్లో
ఊహలు పలికించు కలలేమిటో
పెదవుల తెరలోన మధురాల సిరివాన
మధురిమ లందించు సుధలేమిటో
ప్రవశమే సాగి పరువాలు చెలరేగి
మనసులు కరిగించు సుఖమేమిటో
పల్లవించే మోహ బంధమ్
ఆలపించే రాగ బంధమ్ ఆ.

Thursday, December 18, 2008

క్షమాపణ

ఐ యామ్ వెరి సారి,
బై మిస్టేక్ ఐంది ఈసారి
కరుణించి వదిలేసై ఒకసారి
మర్ల ఐతె ఇచై ఎవరికైన సుపారి
నువ్వు లేకుంటె అవుతాను నెనో బికారి
కవాలంటె వొట్టు పెడతాను వెయ్యొసారి

Tuesday, December 16, 2008

యెన్నెన్నో వర్ణాలు అన్నింట్లొ అందాలు

యెన్నెన్నో వర్ణాలు అన్నింట్లొ అందాలు
ఒకటైతే మిగిలేది తెలుపేనండి
నలుపేమో నాకిష్టమ్ మీ మనసు మీ ఇష్టమ్
నా కోసమ్ మీ ఇష్టమ్ వదలొద్దండి
మీ మది తొందర చేసే బాటను వీడక మీరు సాగిపొండికా
ఇదే ఇదే నా మాటగా పదే పదే నా పాటగా
నేనంటు ప్రత్యేకమ్ నాదంటు ఓ లొకమ్
పడలేను ఏ జొక్యమ్ అంతేనండి
బాగుంది మీ టేస్టు నాకెంతో నచ్చేట్టు
మనసెంతో మెచ్చేట్టు మీ మీదొట్టు
అందుకే నే దిగి వచ్చా
వంచని నా తల వంచా స్నేహ భావమా
కలా నిజమ్ నీ కోసమే అనుక్షణమ్ ఉల్లాసమే
అవును - వారిద్దరు ఇష్టపడ్డారు
వంశి