Wednesday, December 24, 2008

రానేల వసంతాలే

రానేల వసంతాలే
శ్రుతి కానేల సరాగాలే
నీవే నా జీవన రాగం స్వరాల బంధం
నీవే నా యవ్వన కావ్యం స్మరించే గీతం

రానేల

ఈ మౌన పంజరాన నే మూగనై
నీ వేణువూదగానే నీ రాగమై
ఇగిరే శోకమై విరిసే తోటనై
ఏ పాట పాడిన అది పూవులై
అవి నేల రాలిన చిరు తావినై
బదులైన లేని ఆశలారబోసి

రానేల

ఓ ప్రేమికా చెలియా ఒడి చేరవా
ఈ చెలిమిని ఇపుడే దరి చేర్చవా
రగిలే తాపమే ఎదలో తీరగా
నీ చూపు తోనే చలి తీరగా
నీ స్పర్శ తోనే మది పాడగా
ఎద మీటి పోయే ప్రేమగీతిలాగా

రానేల

రేగుతున్నదొక రాగం ఎద లో సొద లా

రేగుతున్నదొక రాగం ఎద లో సొద లా
రేపుతున్నదొక మోహం నది లో అలలా
కనులే ముద్దులాడగా
కలలే కన్ను గీటగా
కసిగా
రేగుతున్నదొక రాగం ఎద లో సొద లా
రేపుతున్నదొక మోహం నది లో అలలా

చెక్కిళ్ళలో ముద్దు చెమ్మ తడి ఆరకున్నది
నీ కళ్ళలో నీటి బొమ్మ కదలాడిందే
తెలిపింది కన్నె గళమే మనువాడ లేదనీ
ఓ పువ్వు పూసింది ఒడిలో తొలి ప్రేమల్లే
మెలకువే స్వప్నమై మెలి తిరిగెను నాలో
ఒరిగినా ఒదిగినా హత్తుకునే ప్రేమ
నీ పిలుపే నిలిచే వలపై
పెదవుల్లో దాగి

రేగుతున్నదొక రాగం ఎద లో సొద లా
రేపుతున్నదొక మోహం నది లో అలలా
కనులే ముద్దులాడగా
కలలే కన్ను గీటగా
కసిగా
రేగుతున్నదొక రాగం ఎద లో సొద లా
రేపుతున్నదొక మోహం నది లో అలలా

తారాడు తలపులెన్నో నీలాల కురులలో
తనువు మరచిపోయె మనులే పొంగే
ముద్దాడ సాగె పెదవి ఒక మూగ భావమే
చాటు కవితలన్నీ అనురాగాలే
పెదవులే విచ్చిన మల్లెపూల వాసన
సొగసులే సోకిన వయసుకే దీవెన
వీరెవరో జత కోకిలలో
ఎద లేడై లేచి

రేగుతున్నదొక రాగం ఎద లో సొద లా
రేపుతున్నదొక మోహం నది లో అలలా
కనులే ముద్దులాడగా
కలలే కన్ను గీటగా
కసిగా
రేగుతున్నదొక రాగం ఎద లో సొద లా
రేపుతున్నదొక మోహం నది లో అలలా

Monday, December 22, 2008

7/G బ్రుందవన్ కాలని

కన్నుల బాసలు తెలియవులె
కన్నెల మనసులు ఎరుగములె
ఒకవైపు చూపి మరువైపు దాచగ
అద్దాల మనసు కాదులె, చేతులు సంధ్రాన్ని మూయలేవులె
గాలివీచి ఆకు రాలిన కొమ్మ గురుతులు చెరగవులె
దెబ్బలెన్ని తిన్న గాని మనసు మాత్రమ్ మారదులె

ఒక పరి మగువ చూడగనె కలిగే వ్యధ తను యెరుగదులె
అనుదినము ఇక తపి ఇంచె యువకుల మనసులు తెలియవులె

కురిసేను విరి జల్లులే

కురిసేను విరి జల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే
అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను
శృంగార మునకీవె శ్రీకారమే కావె
ఆకుల పై రాలు ఆ..
ఆకులపై రాలు హిమబిందువు వోలె
నా చెలి వొడిలోన పవళించనా
ఆకులపై రాలు హిమబిందువు వోలె
నా చెలి వొడిలోన పవళించనా
రాతిరి పగలు మురిపాలు పండించు
చెలికాడిని ఎద చేర్చి లాలించనా
నేను నీకు రాగ తాళమ్
నీవు నాకు వేద నాదమ్ ఆ..

కన్నుల కదలాడు ఆశలు శృతి పాడు
వన్నెల మురిపాల కధ యేమిటో
తలపుల మాటుల్లో వలపుల తోటల్లో
ఊహలు పలికించు కలలేమిటో
పెదవుల తెరలోన మధురాల సిరివాన
మధురిమ లందించు సుధలేమిటో
ప్రవశమే సాగి పరువాలు చెలరేగి
మనసులు కరిగించు సుఖమేమిటో
పల్లవించే మోహ బంధమ్
ఆలపించే రాగ బంధమ్ ఆ.

Thursday, December 18, 2008

క్షమాపణ

ఐ యామ్ వెరి సారి,
బై మిస్టేక్ ఐంది ఈసారి
కరుణించి వదిలేసై ఒకసారి
మర్ల ఐతె ఇచై ఎవరికైన సుపారి
నువ్వు లేకుంటె అవుతాను నెనో బికారి
కవాలంటె వొట్టు పెడతాను వెయ్యొసారి

Tuesday, December 16, 2008

యెన్నెన్నో వర్ణాలు అన్నింట్లొ అందాలు

యెన్నెన్నో వర్ణాలు అన్నింట్లొ అందాలు
ఒకటైతే మిగిలేది తెలుపేనండి
నలుపేమో నాకిష్టమ్ మీ మనసు మీ ఇష్టమ్
నా కోసమ్ మీ ఇష్టమ్ వదలొద్దండి
మీ మది తొందర చేసే బాటను వీడక మీరు సాగిపొండికా
ఇదే ఇదే నా మాటగా పదే పదే నా పాటగా
నేనంటు ప్రత్యేకమ్ నాదంటు ఓ లొకమ్
పడలేను ఏ జొక్యమ్ అంతేనండి
బాగుంది మీ టేస్టు నాకెంతో నచ్చేట్టు
మనసెంతో మెచ్చేట్టు మీ మీదొట్టు
అందుకే నే దిగి వచ్చా
వంచని నా తల వంచా స్నేహ భావమా
కలా నిజమ్ నీ కోసమే అనుక్షణమ్ ఉల్లాసమే
అవును - వారిద్దరు ఇష్టపడ్డారు
వంశి

Monday, December 15, 2008

యేన్నేన్ని కలలు రేపించావే పోన్నారి

కన్నే పిల్లవని కన్నులున్నవని యేన్నేన్ని వగలు పోతున్నావే చిన్నారి,
చిన్న నవ్వు నవ్వి వన్నేలన్ని రువ్వి యేన్నేన్ని కలలు రేపించావే పోన్నారి,
కన్నే పిల్లవని కన్నులున్నవని కవిత చేప్పి నేర్పించవే గడసరి
చిన్న నవ్వు నవ్వి నువ్వు దువ్వి దువ్వి కలిసి మేము నేర్పించేది యెప్పుడని?

ఇది వెన్నెల మాసమని


Sunday, December 14, 2008

మనసు తెర తీచినా మొహమాటమేన

తీగనై మల్లెలు పూచినా వేళ
ఆగనా అల్లన పూజకో మాల
మనసు తెర తీచినా మొహమాటమేన
మమత కలబోసినా మాట కరువేన
తీగనై మల్లెలు పూచినా వేళ
ఆగనా అల్లన పూజకో మాల

తెలిసీ తెలియందా
ఇది తెలియక జరిగిందా
ఎపుడో జరిగిందా
అది ఇపుడే తెలిసిందా
ఆశపడ్డా అందుతుందా
అర్హతైనా ఉందా
అందుకున్నా పొందికుందా
పొత్తు కుదిరేదా
ప్రేమకన్నా పాశముందా
పెంచుకుంటే దోషముందా
తెంచుకుంటే తీరుతుందా
పంచుకుంటే మరిచేదా

కలలో మెదిలిందా
ఇది కథలో చదివిందా
మెరుపై మెరిసిందా
అది వలపై కురిసిందా
రాసి ఉంటే తప్పుతుందా
తప్పు నీదవునా
మారమంటే మారుతుందా
మాసిపోతుందా
చేసుకున్నా పుణ్యముందా
చేరుకునే దారి ఉందా
చేదుకునే చేయి ఉందా
చేయి చేయి కలిపేనా

తీగనై మల్లెలు పూచినా వేళ
ఆగనా అల్లన పూజకో మాల
మనసు తెర తీచినా మొహమాటమేన
మమత కలబోసినా మాట కరువేన
తీగనై మల్లెలు పూచినా వేళ
ఆగనా అల్లన పూజకో మాల

గోదావరి లో ఈ పాట నాకు చాల....

మనసా వాచా నిన్నే వలచ నిన్నే ప్రేమించా
నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా
అ మాట దాచా కలలూ వేచ నడిచానే నీ నీడలా
మనసా వాచా నిన్నే వలచ నిన్నే ప్రేమించా

Saturday, December 13, 2008

గుర్తుపట్టారా?

పూజకు వేలాయర!

బెస్ట్ సన్ సెట్ ఫోటో

నిట్టూర్పు

Office లోఎంత ఎక్కువ సమయం గడిపినా ఇంటిదారి పట్టక తప్పదు కదా.. అప్పటివరకూ దగ్గరకు రావడానికి తటపటాయించిన దిగులు మేఘం నేను మా carఎక్కగానే దర్జాగా నన్ను ఆవరించేస్తుంది.. 'నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమి నైనా' మేఘసందేశంలో పాట అప్రయత్నంగా గుర్తొస్తుంది.. ఇందాక మీ పరిచయాన్నిమళ్ళీ మళ్ళీ తలచుకొని, ఇంకా ఏదో missing.. దక్షిణపు గాలి వెళ్తూ వెళ్తూ మంచి గంధాన్ని నా చుట్టూ చల్లిన అనుభూతి.. అన్నింట్లొ 'అండి ' అని మీరు సంబోధించడం ఇప్పుడింకా నవ్వు తెప్పించింది.. అందులోనే మీరడిగారు నాకు పాటలంటే ఇష్టమేనా అని.. ఎందుకో నేను ఆ ప్రశ్నకి సమాధానం ఇవ్వలేదు.. అంతలోనే ఒక అనుమానం, ఒకవేళ నేను మీరడిగిన వాటన్నిటికీ జవాబులు చెప్పట్లేదని మీకు వెంట వెంటనే రిప్లై రాయాలన్న ఆసక్తి పోయిందేమోనని.. పిచ్చి ఆలోచనని తెలుస్తూనే ఉంది.. మరి కారణం తెలీనప్పుడు మనసు ఇలానే ఆలోచిస్తుందిగా!..........

జీవన పయనము

బ్రతుకు నిరాశ నిస్ప్రుహలతొ వున్న వేళ, ఆశల అలవై తాకావు...నా ఈ జీవన పయనము లో చుక్కానివై వెలుగు చూపావు...జీవించడమ్ నాకు నేర్పి, నీవు యె దూర తీరాలకు వెల్లి పోయావు ?
ఇట్లు
నీ

శ్రేయోభలాషి

ప్రతిక్షనమ్ నీ తలపు యేల?నీ పై నాకు ఇంత ప్రేమ యేల?నా నీడ లో నీ ప్రతిబింభము యేల?సూర్యుడు కరిగి మంచయిన వేళ,నీ మనసు మాత్రమ్ కరుగదు యేల?
ఇట్లు

నీ

అనుకునే

అడుగు

అడుగులో అడుగునై...నువ్వు వస్తూనేవెన్నెలకి వింత మెరుపొచ్చింది!సరుగుడుచెట్ల మధ్య మట్టిరోడ్డొకటినిన్నటి వర్షం కబుర్లేవోచెప్పాలంటుందికాస్సేపలా వెళ్ళొద్దామా?అదిగో.. అలా విసుగ్గా చూడకునువ్వేమీ మాట్లాడక్కర్లేదు!నిద్రపోతున్న గువ్వలజంటనీగుడి గూట్లోని సాంధ్యదీపాన్నీవిచ్చుకోబోతున్న రాధామనోహరాల్నీఇవ్వాళైనా నీతో కలిసి చూడాలనుంది..రేపొద్దున్న మళ్ళీ బ్రతకడంమొదలుపెట్టేలోపుకాస్సేపు జీవించనీ!కాస్త దూరమే.. నడిచొద్దామా?నాకు తెల్సు..వచ్చేప్పుడైనానీకూ అర్ధమౌతుంది..ఊపిరి తాకినంత మాత్రానసామీప్యం సాన్నిహిత్యమవ్వదని!!

ఏకాంతము

ఆమె తో గడపాలనిపిస్తుంది..ఎవ్వరూ లేని ఏకాంతంలో..చీకటి పరిమళాన్ని వెలుగురేఖలుఒక్కొక్కటిగా చుట్టుముడుతుండగా...అనంతమనిపిస్తున్నఆమె అస్థిత్వాన్నిదోసిళ్ళతో దొంగిలిద్దామనిముందుకెళ్ళబోతేఆమె చిరునవ్వొకటిపాదాలని తడిపి వెళ్ళింది!పొగమంచు వలువల్ని విడుస్తున్నరెల్లుగడ్డితో పరాచికాలాడుతున్న పిల్లగాలిఆమె నవ్వు హోరుతో కలిపివింత సవ్వడి చేస్తుంటే..వెన్నెల స్నానం చేసినతెల్లటి తివాచీ మీదమెత్తగా వత్తిగిల్లుతూతదేకంగా చూస్తున్న నా చూపుల్లోంచిఆమె ఒంటి నీలంగుండెల్లోకి ఇంకుతున్న అనుభూతి..చేతనాచేతనాల అవస్థ దాటిన మనసుఆమె లో మునకలు వేస్తూఅమరత్వాన్ని అనుభవిస్తుంటేఅప్పుడెప్పుడో మధ్యలో ఆగిపోయినస్వప్నమొకటిఅరమోడ్పులైన కనుల వెనుకమళ్ళీ మొదలైంది!! ఏకాంతార్ణవం..