Saturday, December 13, 2008

నిట్టూర్పు

Office లోఎంత ఎక్కువ సమయం గడిపినా ఇంటిదారి పట్టక తప్పదు కదా.. అప్పటివరకూ దగ్గరకు రావడానికి తటపటాయించిన దిగులు మేఘం నేను మా carఎక్కగానే దర్జాగా నన్ను ఆవరించేస్తుంది.. 'నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమి నైనా' మేఘసందేశంలో పాట అప్రయత్నంగా గుర్తొస్తుంది.. ఇందాక మీ పరిచయాన్నిమళ్ళీ మళ్ళీ తలచుకొని, ఇంకా ఏదో missing.. దక్షిణపు గాలి వెళ్తూ వెళ్తూ మంచి గంధాన్ని నా చుట్టూ చల్లిన అనుభూతి.. అన్నింట్లొ 'అండి ' అని మీరు సంబోధించడం ఇప్పుడింకా నవ్వు తెప్పించింది.. అందులోనే మీరడిగారు నాకు పాటలంటే ఇష్టమేనా అని.. ఎందుకో నేను ఆ ప్రశ్నకి సమాధానం ఇవ్వలేదు.. అంతలోనే ఒక అనుమానం, ఒకవేళ నేను మీరడిగిన వాటన్నిటికీ జవాబులు చెప్పట్లేదని మీకు వెంట వెంటనే రిప్లై రాయాలన్న ఆసక్తి పోయిందేమోనని.. పిచ్చి ఆలోచనని తెలుస్తూనే ఉంది.. మరి కారణం తెలీనప్పుడు మనసు ఇలానే ఆలోచిస్తుందిగా!..........

No comments:

Post a Comment