Wednesday, December 24, 2008

రానేల వసంతాలే

రానేల వసంతాలే
శ్రుతి కానేల సరాగాలే
నీవే నా జీవన రాగం స్వరాల బంధం
నీవే నా యవ్వన కావ్యం స్మరించే గీతం

రానేల

ఈ మౌన పంజరాన నే మూగనై
నీ వేణువూదగానే నీ రాగమై
ఇగిరే శోకమై విరిసే తోటనై
ఏ పాట పాడిన అది పూవులై
అవి నేల రాలిన చిరు తావినై
బదులైన లేని ఆశలారబోసి

రానేల

ఓ ప్రేమికా చెలియా ఒడి చేరవా
ఈ చెలిమిని ఇపుడే దరి చేర్చవా
రగిలే తాపమే ఎదలో తీరగా
నీ చూపు తోనే చలి తీరగా
నీ స్పర్శ తోనే మది పాడగా
ఎద మీటి పోయే ప్రేమగీతిలాగా

రానేల

2 comments:

  1. ఈ పాట నాకు చాలా ఇష్టం... నా బ్లాగులో కూడా పోస్ట్ చేశాను... సాహిత్యం ఎలా ఉన్నా... ట్యూన్ చాలా బాగుంటుంది...

    ReplyDelete
  2. narasaraopet kada amatram lekunte ala chimpesavy hro
    keep rocking me also narasaraopet................

    ReplyDelete