Sunday, December 14, 2008

మనసు తెర తీచినా మొహమాటమేన

తీగనై మల్లెలు పూచినా వేళ
ఆగనా అల్లన పూజకో మాల
మనసు తెర తీచినా మొహమాటమేన
మమత కలబోసినా మాట కరువేన
తీగనై మల్లెలు పూచినా వేళ
ఆగనా అల్లన పూజకో మాల

తెలిసీ తెలియందా
ఇది తెలియక జరిగిందా
ఎపుడో జరిగిందా
అది ఇపుడే తెలిసిందా
ఆశపడ్డా అందుతుందా
అర్హతైనా ఉందా
అందుకున్నా పొందికుందా
పొత్తు కుదిరేదా
ప్రేమకన్నా పాశముందా
పెంచుకుంటే దోషముందా
తెంచుకుంటే తీరుతుందా
పంచుకుంటే మరిచేదా

కలలో మెదిలిందా
ఇది కథలో చదివిందా
మెరుపై మెరిసిందా
అది వలపై కురిసిందా
రాసి ఉంటే తప్పుతుందా
తప్పు నీదవునా
మారమంటే మారుతుందా
మాసిపోతుందా
చేసుకున్నా పుణ్యముందా
చేరుకునే దారి ఉందా
చేదుకునే చేయి ఉందా
చేయి చేయి కలిపేనా

తీగనై మల్లెలు పూచినా వేళ
ఆగనా అల్లన పూజకో మాల
మనసు తెర తీచినా మొహమాటమేన
మమత కలబోసినా మాట కరువేన
తీగనై మల్లెలు పూచినా వేళ
ఆగనా అల్లన పూజకో మాల

1 comment:

  1. ఈ పాట నాకు చాలా చాలా ఇష్టం... నా బ్లాగులో కూడా ఉంటుంది... అద్భుతమైన సాహిత్యం... ఇంకా అద్భుతమైన సంగీతం... వాటికి ధీటైన స్వరాలూ... love this song!

    ReplyDelete